డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “ఆపరేషన్ వాలెంటైన్”

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “ఆపరేషన్ వాలెంటైన్”

Published on Jan 16, 2024 6:10 PM IST

టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిసారిగా గాండీవధారి అర్జున చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం ఆడియెన్స్ ను అలరించడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు ఈ హీరో తన రాబోయే తెలుగు – హిందీ ద్విభాషా వెంచర్ ఆపరేషన్ వాలెంటైన్‌తో పై దృష్టి సారించాడు. ఫిబ్రవరి 16, 2024న సినిమా థియేటర్ల లో రిలీజ్ కి సిద్ధమైంది. వరుణ్ తేజ్ సరసన ఈ సినిమా లో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. మొదటి సింగిల్, వందేమాతరం, జనవరి 17, 2024న విడుదల కానుందని టీమ్ ఇప్పటికే ధృవీకరించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసాన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు