ఓటిటి : కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కి సూపర్ రెస్పాన్స్

Published on Feb 15, 2023 1:30 am IST


షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, కే కే మీనన్ వంటి వారు ప్రధాన పాత్రల్లో రాజ్ & డీకే తెరకెక్కించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ షో ఫర్జి. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ వెబ్ షో ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో ఇటీవల ప్రేక్షకాభిమానులకి అందుబాటులోకి వచ్చింది.

రిలీజ్ అయిన రోజు నుండి మన ఇండియా తో పాటు యుఎస్ఏ, యుకె, కెనడా, ఆస్ట్రేలియా, యుఏఈ, సింగపూర్ వంటి దేశాల ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటూ ప్రస్తుతం భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది ఈ వెబ్ షో. దొంగ నోట్ల ముద్రణ అనే అంశం తీసుకున్న దర్శకులు రాజ్ & డీకే ఇద్దరూ కూడా అందరినీ అలరించేలా ఫర్జి ని తెరకెక్కించారని అంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా యక్షన్, ఛేజింగ్ అంశాలతో పాటు మధ్యలో కామెడీ తో కూడిన ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ తో ఈ వెబ్ షో ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :