ఓటీటీ : ‘దీపావళి బ్లాక్ బస్టర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ఓటీటీ : ‘దీపావళి బ్లాక్ బస్టర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Nov 10, 2025 2:00 PM IST

dude 1 2

ప్రదీప్ రంగనాథన్ తాజా హిట్ చిత్రం డ్యూడ్. దీపావళి కానుకగా థియేటర్స్ లో అలరించడానికి వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రావడానికి రెడీగా ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం స్ట్రీమింగ్ తేదీని ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 14, 2025న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో డ్యూడ్ స్ట్రీమింగ్ కానుంది అని నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తాజాగా వెల్లడించింది.

అన్నట్టు ఈ సూపర్‌హిట్ చిత్రంలో మమితా బైజు (ప్రేమలు ఫేమ్) కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం రెండవ వారంలోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరో హిట్ గా కోలీవుడ్ లో అందుకున్నారు. తమిళ సీనియర్ హీరో ఆర్. శరత్‌కుమార్ ఆసక్తికరమైన పాత్రను పోషించగా, నేహా శెట్టి ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆర్. శరత్‌కుమార్, రోహిణి మొల్లెటి మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు, దీనికి సాయి అభ్యాంకర్ సంగీతం అందించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు