ఓటిటి సమీక్ష: “కుడుంబాస్థాన్” – తెలుగు డబ్ చిత్రం జీ5 లో

ఓటిటి సమీక్ష: “కుడుంబాస్థాన్” – తెలుగు డబ్ చిత్రం జీ5 లో

Published on Mar 9, 2025 10:59 PM IST

Kudumbasthan

విడుదల తేదీ : మార్చి 07, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : మణికందన్, సాన్వి మేఘన, గురు సోమసుందరం, సుందరరాజన్, ప్రసన్న బాలచంద్రన్, జెన్సన్ ధివాకర్ మరియు ఇతరులు

దర్శకుడు : రాజేశ్వర్ కలిసామి
నిర్మాతలు : ఎస్.వినోత్ కుమార్
సంగీతం : వైశాఖం
సినిమాటోగ్రఫీ : సుజిత్ ఎన్. సుబ్రమణ్యం
ఎడిటింగ్ : కన్నన్ బాలు

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా నేరుగా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో తమిళ చిత్రం “కుడుంబాస్థాన్” కూడా ఒకటి. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ5 లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే.. నవీన్(మణికందన్) ఒక చిన్నపాటి మిడిల్ క్లాస్ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి నీలా(సాన్వి మేఘన) ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడు. కానీ ఒక్కసారిగా తన లైఫ్ తలకిందులు అయ్యిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులతో అప్పులు పాలు అయ్యిపోతాడు. అయితే తన జీవితం సడెన్ గా ఎందుకు ఇలా అయ్యిపోయింది? తాను చేసిన అప్పుడు తీర్చగలుగుతాడా? తనని ఇలా ఇబ్బంది పడేలా చేసింది ఎవరు? ఈ సమస్యలు అన్నిటి నుంచి తాను బయటకి వచ్చాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

జై భీమ్ నటుడు మణికందన్ మంచి టాలెంట్ కలిగిన నటుడు చాలా ఈజ్ తో నాచురల్ నటనతో ఇంప్రెస్ చేస్తాడు. ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో కూడా తనదైన పెర్ఫామెన్స్ ని అందించాడు అని చెప్పవచ్చు. తన పాత్ర చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

అందులోని బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని తాను బాగా పండించాడు. ఇక నటుడు గురు సోమసుందరం తన పాత్రలో షైన్ అయ్యారు అని చెప్పవచ్చు. సినిమాలో పలు సన్నివేశాలని తన హ్యూమర్ తో ఎంజాయ్ చేసే విధంగా మార్చారు.

మెయిన్ గా తనపై ఇంటర్వెల్ సీక్వెన్స్ తనపై భలే అనిపిస్తుంది. ఇక నటి సాన్వి మేఘన డీసెంట్ రోల్ లో మంచి నటన కనబరిచింది. ఇక వీరితో పాటుగా మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో అక్కడక్కడా మంచి కామెడీ కనిపిస్తుంది కానీ ఈ మూమెంటం పూర్తి స్థాయిలో కొనసాగితే బాగుండు అనిపిస్తుంది. కొంతమేర సినిమా స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. దీంతో అక్కడక్కడా ఆడియెన్ పక్కదారి పట్టవచ్చు. అలాగే సినిమాలో ఎమోషనల్ పార్ట్ కూడా ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది.

ఉన్న ఎమోషనల్ డెప్త్ సరిపోనట్టు అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ రోల్ కూడా లిమిటెడ్ గానే అనిపిస్తుంది. తన పాత్ర ఇంకా బెటర్ గా షేప్ అవుట్ చేసేందుకు ఆస్కారం ఉంది కానీ ఎందుకో మిస్ చేసినట్టు అనిపించక మానదు.

అలాగే సినిమా తెలుగు డబ్బింగ్ ఇంకా బెటర్ గా చేసి ఉంటే అది సినిమాని ఇంకా నాచురల్ గా మార్చి ఉండవచ్చు. తెలుగు డబ్బింగ్ ఈ సినిమాలో అన్ని పాత్రలకి అంత నాచురల్ గా క్లిక్ కాలేదు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సంగీతం బానే ఉంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ అని చెప్పవచ్చు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు రాజేశ్వర్ కాళిస్వామి విషయానికి వస్తే.. తనకి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ తన దర్శకత్వ మెళుకువలు బాగున్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల కథనం స్లోగా నడిపించారు కానీ ఎంటర్టైనింగ్ గా ఈ కథని ప్లాన్ చేసుకున్న విధానం బాగుంది. అలాగే పలు ఎమోషన్స్ ని కూడా బాగానే రాసుకున్నారు. అయితే వీటిని సహా మరికొన్ని అంశాలు మరింత బెటర్ గా చూపించి ఉంటే అవుట్ పుట్ మరింత అందంగా వచ్చి ఉండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే.. ఈ “కుడుంబాస్థాన్” ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. మెయిన్ గా మణికందన్ సహా నటుడు గురు సినిమాలో అలరిస్తారు. అలాగే కొన్ని ఎమోషన్స్ కూడా బాగున్నాయి. కానీ అక్కడక్కడా కథనం స్లోగా ఉంది. వీటిని పక్కన పెడితే జీ5 లో ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు