వెంకీమామ “సైంధవ్” స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరంటే.!

వెంకీమామ “సైంధవ్” స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరంటే.!

Published on Jan 13, 2024 8:09 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్దా శ్రీనాథ్, రుహాణి శర్మ అలాగే ఆండ్రియా జెరెమియా సహా కోలీవుడ్ నటుడు ఆర్య లాంటి స్టార్స్ కలయికలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ డ్రామా “సైంధవ్” కోసం తెలిసిందే. చాలా కాలం తర్వాత వెంకీ మామ నుంచి వస్తున్నా ఓ ప్రాపర్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరక్కెక్కించగా ఈ సంక్రాంతి కానుకగా అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.

మరి ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత “సైంధవ్” చిత్రం ఎందులో స్ట్రీమింగ్ కి వస్తుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అయితే సొంతం చేసుకున్నారు. సో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ “సైంధవ్” చిత్రాన్ని అందులో చూడవచ్చు. ఇక టెలివిజన్ హక్కులు అయితే ఈటీవీ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు