ఓటిటి పార్ట్నర్స్ ని లాక్ చేసుకున్న “అయలాన్”, “కెప్టెన్ మిల్లర్”

ఓటిటి పార్ట్నర్స్ ని లాక్ చేసుకున్న “అయలాన్”, “కెప్టెన్ మిల్లర్”

Published on Jan 13, 2024 6:55 PM IST

ఈ సంక్రాంతి కనుక మన టాలీవుడ్ నుంచి సహా తమిళ సినిమా నుంచి కూడా పలు చిత్రం థియేట్రికల్ రిలీజ్ కి గాను గ్రాండ్ గా విడుదల అయ్యాయి. అయితే టాలీవుడ్ లోనే ఎక్కువ పోటీ నెలకొనడంతో తమిళ్ నుంచి డబ్ అయ్యి రిలీజ్ కావాల్సిన చిత్రాలు అయితే డబ్బింగ్ రిలీజ్ ని ఆపుకున్నాయి.

మరి ఆ చిత్రమే స్టార్ హీరో ధనుష్ నటించిన యాక్షన్ డ్రామా “కెప్టెన్ మిల్లర్” కాగా మరో చిత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం “అయలాన్”. మరి ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం తమిళ్ లో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాలు తాలూకా ఓటిటి పార్ట్నర్స్ విషయంలో ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ రెండు సినిమాల హక్కులు కూడా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే అయలాన్ కి మాత్రం ప్రైమ్ వీడియోతో పాటుగా సన్ నెక్స్ట్ వారు కూడా కోలాబ్ అయ్యినట్టు రూమర్స్ ఉన్నాయి. మరి దీనిపై తర్వాత అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని అరుణ్ మాతేశ్వర్ దర్శకత్వం వహించగా అయలాన్ చిత్రాన్ని ఆర్ రవికుమార్ తెరకెక్కించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు