లేటెస్ట్..”పక్కా కమర్షియల్” ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!

లేటెస్ట్..”పక్కా కమర్షియల్” ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!

Published on Jul 31, 2022 7:03 AM IST

ఈ జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఎంటర్టైనర్ “పక్కా కమర్షియల్” కూడా ఒకటి. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది కానీ అంచనాలు అయితే థియేట్రికల్ గా అందుకోలేకపోయింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో అలరించేందుకు సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్ మరియు ఆహా లు కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి వీటిలో ఈ చిత్రం ఆగస్టు 5 లేదా 8 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు