ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన రష్మిక లేటెస్ట్ చిత్రం

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన రష్మిక లేటెస్ట్ చిత్రం

Published on Dec 16, 2025 9:02 AM IST

Rashmika Mandanna's Thamma Review

మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU) నుంచి వచ్చిన తాజా చిత్రం ‘థామా’లో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. దీపావళి సీజన్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఫ్రాంచైజ్‌కు ఉన్న బలమైన క్రేజ్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక, సగటు వసూళ్లకే పరిమితమైంది.

ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. కొన్ని వారాల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చిన థామా, ఇప్పుడు ప్రైమ్ సభ్యుల కోసం ఉచితంగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. హిందీ, తెలుగు ఆడియోలతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో ఈ సినిమా చూడవచ్చు.

ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ కీలక పాత్రల్లో కనిపించారు. మ్యాడాక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి సచిన్-జిగర్ సంగీతం అందించారు. మలైకా అరోరా, నోరా ఫతేహీ, వరుణ్ ధావన్ ప్రత్యేక అతిథి పాత్రల్లో సందడి చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు