వేగం పెంచిన తమన్నా టీవీ షో..!

Published on Jul 19, 2021 12:02 am IST

తమన్నా భాటియా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నా, బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యారు. తన తొలి టీవీ షో తెలుగు లో ప్రసారం అయ్యేందుకు సర్వం సిద్దం అవుతోంది. అయితే ఇప్పటికే ఈ షో కి సంబంధించిన గ్లింప్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో ను జెమిని టీవీ ఆగస్ట్ మూడవ వారం నుండి ప్రసారం చేయాలని భావిస్తోంది. అయితే ఈ కార్యక్రమం కి సంబంధించిన ప్రోమో ను త్వరలో విడుదల చేయనుంది జెమిని టీవీ. అయితే ఎప్పటి నుండి ప్రసారం అవుతుంది అనే దాని పై త్వరలో ఒక స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే ఈ షో కి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రోమో ద్వారా ఎప్పటి నుండి ప్రసారం కానుందో తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :