మాస్ డ్యాన్సులతో రెచ్చిపోయిన వర్షిణీ, రష్మీ..!

Published on Jul 13, 2021 1:51 am IST

స్టార్ మాలో ప్రముఖ యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4లో భాగంగా ఈ వారంలో వచ్చే ఎపిసోడ్‌కు యాంకర్ వర్షిణీ, రష్మీలు వచ్చారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో యాంకర్ ఓంకార్ కళ్లల్లో కళ్లు పెట్టి రష్మీతో చెప్పిన డైలాగ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

మీరు చిలిపిగా నవ్వితే మల్లెపూల సునామీ, చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ.. యమ్మీ.. అందుకే మీరంటే అందరికీ ఇష్టం రష్మీ.. నేను చెబుతుంది నిజమా, అబద్ధమా అని ఓంకార్ అడగ్గా రష్మీ అందుకు లోలోపల తెగ సిగ్గుపడింది. ఇక మాస్ పాటలకు, బీట్స్‌కు వర్షిణీ, రష్మీ వేసిన స్టెప్పులు చూసే వారిలో కూడా పూనకాలు తెప్పించేలా అనిపించాయి. మరీ వీరిద్దరి ఎంటర్‌టైన్మెంట్‌ను మిస్ కాకూడదంటే మాత్రం ఈ వీకెండ్ స్టార్ మాలో వచ్చే సిక్స్త్ సెన్స్ ఎపిసోడ్‌ను తప్పక చూడాలండోయ్.

సంబంధిత సమాచారం :