ఎమోషనల్ ప్రోమోతో ఎన్టీఆర్ గ్రాండ్ షో సిద్ధం.!

Published on Aug 1, 2021 3:21 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగానే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా తన యాంకరింగ్ ప్రెజెన్స్ తో అద్భుతంగా బిగ్ బాస్ అనే షో ని రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. మరి దాని తర్వాత మళ్ళీ తారక్ స్క్రీన్ పైకి రాలేదు. దీనితో మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరో బిగ్గెస్ట్ రియాలిటీ షో తన నుంచి అనౌన్సమెంట్ ఇచ్చేసారు. అదే “ఎవరు మీలో కోటీశ్వరులు” షో..

గత కొన్నాళ్ల కిందటే అనౌన్స్ చేసిన ఈ షో ఇప్పటికీ కాస్త సస్పెన్స్ గా నడుస్తూ వచ్చింది. కానీ ఈ షో ఫేడ్ అవుట్ అవ్వలేదని మళ్ళీ మేకర్స్ వెలుగులోకి ఈ షోని తెచ్చారు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ ప్రోమోతో ఈ షో పై తాజా అప్డేట్ ఇచ్చేసారు. చాలా ఎమోషనల్ గా కట్ చేసిన ఈ ప్రోమోతో పాటుగా ఈ షో ఇదే ఆగష్టు లో ఈ షో టెలికాస్ట్ కానున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేసి తెలిపారు. అలాగే ఈ షో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా చరణ్ వస్తాడని కూడా బజ్ ఉంది. మరి అది ఎంతమేర నిజమో చూడాలి.

సంబంధిత సమాచారం :