ఎన్టీఆర్ – చరణ్ రియాక్షన్స్.. అసలేంటిది, వీడియో వైరల్ !

Published on Dec 12, 2021 7:20 pm IST

విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ భారీ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతమైన స్పందన తో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ అభిమానుల ఆకలిని తీర్చింది. అయితే, అభిమానులే కాదు, ట్రైలర్ చూసి ఎన్టీఆర్ -చరణ్ కూడా అంతే స్థాయిలో థ్రిల్ ఫీల్ అయ్యారు.

ట్రైలర్ ఇచ్చిన కిక్ తో చరణ్ ఆనందాన్ని ఆపుకోలేక, రాజమౌళిని గట్టిగా హత్తుకోగా.. ఎన్టీఆర్ కూడా బాగా ఎగ్జైట్ అవుతూ.. అసలు అదేంటది..? అంటూ బాగా ఎంజాయ్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూశాక, మా బీమ్ -రామ్ రియాక్షన్ ఇది అంటూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఈ క్రింద వీడియోని పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. వీడియోలో చరణ్ – ఎన్టీఆర్ లతో పాటు రాజమౌళి నవ్వులు కూడా బాగా ఆకట్టుకున్నాయి. రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లు ‘ఆర్ఆర్ఆర్’ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తీసుకురాబోతున్నాడు. అందుకే భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :