ఓటీటీ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిన పాగల్ !

Published on May 24, 2021 12:16 pm IST

ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్రేజీ లవ్ స్టోరీతో పాగల్ అంటూ ఓ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. “ఫలక్ నమా దాస్” హిట్ చిత్రాలతో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తోన్న ఈ సినిమా ఓటీటీల నుండి మంచి ఆఫర్స్ వచ్చాయట. అయితే, విశ్వక్ సేన్ కి మంచి థియేటర్ బిజినెస్ ఉండటంతో మేకర్స్ ఓటీటీ ఆఫర్స్ ను రిజెక్ట్ చేశారు.

కాగా ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. ఇక “ఫలక్ నమా దాస్”తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ సినిమా కావడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరెకెక్కించారట.

సంబంధిత సమాచారం :