యువ హీరో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నతాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ హను రాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ చిత్ర టీజర్ అక్టోబర్10న ఉదయం 9:30గంటలకు విడుదలకానుంది.
ఇక ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ గా కనిపించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నా ఈ చిత్రాన్ని చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం డిసెంబర్ 21 న ప్రేక్షకులముందుకు రానుంది.


