ప్రమోషన్స్ లో జోరు పెంచిన ‘పడిపడి లేచె మనసు’ !

ప్రమోషన్స్ లో జోరు పెంచిన ‘పడిపడి లేచె మనసు’ !

Published on Nov 22, 2018 9:31 AM IST

Padi Padi Leche Manasu1

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పడిపడి లేచె మనసు’. ఈచిత్రం విడుదలకు ఇంకా నెల రోజులు సమయం కూడా లేకపోవడంతో ఈచిత్రం యొక్క ప్రమోషన్స్ లో జోరు పెంచారు . దాంట్లో భాగంగా ఇటీవల టీజర్ తో పాటు టైటిల్ సాంగ్ ను విడుదలచేసిన చిత్ర యూనిట్ ఇక ఇప్పుడు తాజాగా టైటిల్ వీడియో సాంగ్ ను రేపు ఉదయం 11గంటలకు విడుదలచేయనున్నారు. ఈసాంగ్ పిక్చరైజేషన్ ఆకట్టుకునేలావుంటుందని సమాచారం.

ఇక వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ శర్వా మంచి ఇమేజ్ ను కలిగి ఉండడం అలాగే ‘ఎంసీఏ’ తరువాత తెలుగు లో సాయి పల్లవి నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని చెరుకూరిసుధాకర్,చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందతున్న ఈచిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు