పెద్ద సినిమాల తరహాలో ముందుకెళుతున్న ‘జార్జ్ రెడ్డి’

Published on Nov 16, 2019 3:00 am IST

వచ్చే వారం విడుదలకానున్న సినిమాల్లో ‘జార్జ్ రెడ్డి’ కూడా ఒకటి. కేవలం ట్రైలర్ తోనే చిత్రానికి బోలెడంత పబ్లిసిటీ, పాజిటివ్ క్రేజ్ ఏర్పడ్డాయి. దీంతో చిత్ర బృందం రెట్టించిన ఉత్సాహంతో విడుదల సన్నాహాలు చేస్తోంది. చిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు టీమ్. అందుకే విడుదలకు ఒక రోజు ముందు నవంబర్ 21న రాత్రి హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్ వేదికగా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.

సాధారణంగా ఎంతో నమ్మకం ఉంటే తప్ప పెద్ద సినిమాలకు సైతం ఇలా పెయిడ్ ప్రీనియర్స్ వేయరు. అలాంటిది చిన్న చిత్రమైన ‘జార్జ్ రెడ్డి’కి పెయిడ్ ప్రీమియర్స్ వేయడం చూస్తుంటే సినిమాపై దర్శక నిర్మాతలకి ఎంత నమ్మకముందో తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైక్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘వంగవీటి’ ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఉస్మానియా స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

సంబంధిత సమాచారం :

More