‘పక-రివర్ అఫ్ బ్లడ్’ నిజంగా గర్వకారణం..!

‘పక-రివర్ అఫ్ బ్లడ్’ నిజంగా గర్వకారణం..!

Published on Jul 28, 2021 11:00 PM IST

మల్లేశం వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు తాజాగా ‘పక-రివర్ ఆఫ్ బ్లడ్’ అనే సినిమాతో వస్తున్నారు. నితిన్ లూకోస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మలయాళ సినిమాకు అనురాగ్ కశ్యప్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉత్తర కేరళలోని వయానాడ్ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరింపబడిన ఈ సినిమాలో బాసిల్ పాలోస్, వినీత కోషీ, జోష్ కిళక్కన్, అతుల్ జాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య రగులుతున్న పగ, ద్వేషాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక నది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

గతంలో ఈ చిత్రం ఎన్‌ఎఫ్‌డిసి ఫిల్మ్ బజార్ 2020లో వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ లో ఉత్తమ ప్రాజెక్ట్ గా గెలుపొందింది. ఇకపోతే ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక టొరాంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న రెండు భారతీయ చలనచిత్రాల్లో ‘పక-రివర్ బ్లడ్’ కూడా ఉంది. ఇలాంటి సినిమాకి మన తెలుగు వారు నిర్మాతలు కావడం గర్వకారణం. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు‌ నితిన్ లూకోస్ కి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకాంత్ కబోతు, సంగీత దర్శకుడిగా ఫైజల్ ఎహ్మద్ వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు