‘మసాలా’ సినిమా తర్వాత ఒక ఏడాది గ్యాప్ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన సినిమా ‘పండగ చేస్కో’. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని మే 29న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. సినిమా రిలీజ్ కి ఒక వారం రోజుల ముందే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫైనల్ ప్రింట్స్ తో సిద్దంగా ఉండాలని ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది. మరో మూడు రోజుల్లో ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని సిద్దం చేసి సెన్సార్ కి పంపనున్నారు. మే 22న ‘పండగ చేస్కో’ సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది.
తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవలే విడుదలైంది. తమన్ ట్యూన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ట్రైలర్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ జోడీ కట్టారు. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన వీకెండ్ వెంకట్ పాత్ర ఆధ్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని అంటున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు. ఇది కాకుండా రామ్ ప్రస్తుతం శివం, హరికథ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


