నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న సంగతి మంకు తెలిసిందే. అవే ‘పటాస్’ మరియు ‘షేర్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘పటాస్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలని షూట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయ్యింది.
ఇప్పటి వరకూ షూటింగ్ అయిన పార్ట్ విషయంలో కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఇది కాకుండా షేర్ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇవి రెండూ కాకుండా కలయన్ రామ్ తన ప్రొడక్షన్ బ్యానర్ లో ‘కిక్ 2’ ని నిర్మిస్తున్నారు.


