ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన పవన్‌ తేజ్‌ కొణిదెల !

Published on Jan 25, 2020 9:00 pm IST

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

ఈ సందర్భంగా.. నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ – “ఈ కథలో పాత్రలు కల్పితం’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న నటుడిలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. దర్శకుడు అభిరామ్‌ మేకింగ్ ఫ్రెష్ గా ఉంది. ‘జెస్సీ’ కి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన సునీల్‌ కుమార్‌ బ్యూటిఫుల్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ డైలాగ్స్‌ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి” అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More