మోస్ట్ అవైటెడ్ సినిమాకు కూడా పవన్ రెడీనా.?

Published on Oct 31, 2020 7:02 am IST

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలకు ఓకే చెప్పేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సినిమాలు పవన్ చేతిలో ఉన్నాయి. వాటిలో దర్శకుడు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న “వకీల్ సాబ్” దాదాపు పూర్తి కానుండగా తర్వాత క్రిష్ అలాగే ఆ తర్వాత తన హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ లతో సినిమాలు రెడీగా ఉన్నాయి.

అయితే వీటన్నిటిలో మాత్రం మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది క్రిష్ తో ప్లాన్ చేస్తున్న పీరియాడిక్ చిత్రమే అని చెప్పాలి. ఈ ఇద్దరి కాంబోనే ఊహించనిది అలాగే పవన్ ఎప్పుడు టచ్ చెయ్యని జానర్ కావడంతో ఈ చిత్రాన్ని స్పెషల్ గా తీసుకున్నారు.

అందుకే ఈ సినిమా కోసం ఒకింత ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వకీల్ సాబ్ షూట్ కు రెడీ అవుతుండగా క్రిష్ తో సినిమాకు కూడా రెడీ అన్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వచ్చే డిసెంబర్ లో పవన్ డేట్స్ ను ఇవ్వనున్నట్టు బజ్ వినిపిస్తుంది. మరి పవన్ ఎప్పుడు మొదలు పెట్టనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More