‘భీమ్లా నాయక్’ గ్లింప్స్ రికార్డుల మోత మోగిస్తోంది !

Published on Aug 16, 2021 6:11 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలయికలో రానున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. ఈ సినిమా నుండి వచ్చిన మోస్ట్ పవర్ ఫుల్ గ్లింప్స్ భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. పవన్ అభిమానుల్లో ఉత్సహాన్ని రెట్టింపు చేసింది. అయితే “భీమ్లా నాయక్” గ్లింప్స్ వీడియో 24 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ పొందింది. అలాగే, 7 లక్షల లైకులు అందుకుంది.

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొదటి పాట వచ్చే నెల 2న విడుదల కానుంది. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాను జనవరి 12, 2021కి రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ – రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మళయాలి రీమేక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :