గంగానదిని ప్రక్షాళన చేస్తానంటున్న పవన్

Published on Oct 11, 2019 10:30 am IST

పూర్తి స్థాయి రాజకీయాలపై ద్రుష్టి సారించిన పవన్ ప్రతి సామజిక విషయంపై స్పందిస్తూ, ముందుకెళుతున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో కేంద్రం చేపట్టనున్న యురేనియం తవ్వకాలకు ఆయన వ్యతిరేకంగా గళమెత్తారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపరాదంటూ, సేవ్ నల్లమల పేరుతో క్యాంపైన్ నడిపారు. దీనికి సామాజిక వేత్తలతో పాటు, టాలీవుడ్ సెలెబ్రిటీస్ నుండి కూడా మంచి స్పందన లభించింది.

తాజాగా దేశంలోని పవిత్ర నదులలో ఒకటిగా భావించే గంగా నది ప్రక్షాళనకు తన వంతు సాయం చేస్తానంటూ పవన్ ప్రకటించారు. స్వార్థపరుల కోరలలో చిక్కుకొని కాలుష్యం అవుతున్న గంగా నది ఉన్నతికి, ఉనికి కొరకు శ్రమించిన జీడీ అగర్వాల్ ని మనం గుర్తించుకోవాలన్నారు.రాజకీయంగా సీరియస్ గా ముందు కెళుతుండగా మరోవైపు రామ్ చరణ్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ మూవీ చేస్తున్నారంటూ కొన్ని మాధ్యమాలు వార్తలు రాయడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

X
More