టెన్షన్ టెన్షన్ గా ఉన్న పవన్ దర్శకులు.?

Published on Nov 27, 2020 9:07 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు ఒక పక్క పాలిటిక్స్ మరియు సినిమాలు రెండు బ్యాలన్స్ చేస్తూ పని చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. పవన్ ఇప్పుడు ఏకాంగా ఐదారు సినిమాలు లైన్ లో పెట్టేసారు. వకీల్ సాబ్ ఎలాగో సెట్స్ లోనే ఎక్కువగా పూర్తి అవుతుంది కాబట్టి ఆ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణుకు కాస్త పని తక్కువే బ్రేక్ లు వేశారు పవన్.

ఇపుడు ఇదే ప్లానింగ్ ఇతర పవన్ దర్శకులను ఇబ్బంది పెట్టేలా ఉందని తెలుస్తుంది. పవన్ ఓ సినిమా చేస్తున్న క్రమంలో పాలిటిక్స్ వల్ల చాలానే బ్రేకులు తీసుకుంటున్నారు. దీనితో ఒక సినిమా చేసేందుకే చాలా సమయం అయ్యిపోతుంది. దీనితో ఒక సినిమా పూర్తయ్యేది ఎప్పుడు దాని తర్వాత ఇంకోటి మొదలు కావడం దానికి కూడా బ్రేకులు పడడం ఇవన్నీ వారికి టెన్షన్ పుట్టించే అంశాలుగా మారాయి.

వకీల్ సాబ్ అంటే ఇండోర్ షూట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ సమయంలో పూర్తి చెయ్యొచ్చు కానీ మిగతా సినిమాలు అన్ని అవుట్ డోర్ లో షూట్ ఉన్నవే సరే త్వరగా ఫినిష్ చేసేద్దామనా క్వాలిటీ విషయంలో సరిగ్గా వస్తుందా అన్న అనుమానాలు కూడా రాకపోవు. మొత్తానికి మాత్రం పవన్ తో సినిమా కాస్త టెన్షన్ టెన్షన్ గానే అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More