అయోధ్య రామ మందిర నిర్మాణానికి పవన్ భారీ విరాళం.!

Published on Jan 22, 2021 4:00 pm IST

తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏపాటిదో తెలిసిందే. మరి అలాగే పవన్ తన సినిమాలతో పాటుగా పాలిటిక్స్ లో కూడా బిజీగానే ఉన్నారు. అయితే పవన్ ఈ రెండింటితో పాటుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అలా విరాళాలు ప్రకటించడంలో ఒక అడుగు ముందే పవన్ ఉంటారు.

మరి అలా గతంలో కరోనా కష్ట కాలం సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా కేంద్ర సంక్షేమ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించారు. మరి ఇప్పుడు మన దేశపు అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయం అయోధ్య రామ మండిన నిర్మాణానికి కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి తిరుపతిలో పర్యటిస్తున్న పవన్ రాష్ట్ర ఆర్ ఎస్ ఎస్ ముఖ్యులు భరత్ జీ కు తాను విరాళం ప్రకటించిన 30 లక్షల రూపాయల చెక్ ను అందజేసినట్టుగా వారి పార్టీ జనసేన వారు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పవన్ క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ సినిమా చేస్తుండగా ఆల్రెడీ కంప్లీట్ అయ్యిన “వకీల్ సాబ్” విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :