చిరు కుటుంబం ఆయన్ని అంతగా ఆరాదిస్తారా..?

Published on Jul 12, 2020 4:03 pm IST

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ ఆయనకు మరియు వారి కుటుంబానికి అమితాబ్ అంటే ఎంతటి అభిమానమో తెలియజేసింది. నిన్న ట్విట్టర్ ద్వారా అమితాబ్ బచ్చన్ తనకు కోవిడ్ సోకిందని తెలియజేయగానే…దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 77 ఏళ్ల అమితాబ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ కేవలం ఇంటికే పరిమితం అవుతుండగా…ఆయనకు కరోనా ఎలా సోకింది, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే ఆందోళన అందరిలో మొదలైంది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా సోకడం అందరినీ షాక్ కి గురిచేసింది.

కాగా ఈ విషయంపై పవన్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తుంది. అమితాబ్ పట్ల చిరు కుటుంబానికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ పవన్ గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. పవన్, చిరు మరియు వాళ్ళ అమ్మా నాన్న అప్పట్లో కూలీ మూవీ షూటింగ్ లో అమితాబ్ ప్రమాదానికి గురైతే త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించారట. ఆయన టాలెంట్ తో పాటు, పోరాటతత్త్వం, దయాగుణం, ఆత్మస్థైర్యం నాకు బాగా నచ్చిన అంశాలు అని చెప్పిన పవన్, అమితాబ్, అభిషేక్ సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం :

More