అయ్యప్పణం కు పవన్ ఫ్యాన్స్ డిమాండ్ వేరే..!

Published on Oct 30, 2020 12:01 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను ఓకే చేసేసారు. దీనితో పవన్ అభిమానుల్లో కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ఒకటి రెండు మినహా మిగతా సినిమాలు ఎప్పుడు టేకప్ అవుతాయో అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పవన్ లేటెస్ట్ గా చేపట్టిన సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ విషయంలో అయితే పవన్ అభిమానులు చాలా అత్యుత్సాహం కనబరుస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే రకరకాల స్పెక్యులేషన్స్ కూడా స్ప్రెడ్ నేపథ్యంలో తాజాగా వినిపించిన గాసిప్ ఈ చిత్రంలో ఓ రోల్ లో నితిన్ కనిపిస్తాడని. ఒక్కసారిగా ఇది పవన్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. కానీ నితిన్ కు అనుకున్న రోల్ లో మాత్రం పవన్ అభిమానుల పల్స్ వేరే విధంగా ఉంది. వారి విజువల్ లో మాత్రం మాస్ మహారాజ్ రవితేజ ను ఫిక్సయ్యారు.

ఆ రోల్ కు అతను అయితే కరెక్ట్ గా సెట్టవుతారని వారి డిమాండ్ ను దర్శకుడు సాగర్ చంద్ర మరియు మేకర్స్ కు గట్టిగానే విన్నవిస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఆ రోల్ కు ఇంకా పరిశీలనలోనే ఉన్నట్టు తెలుస్తుంది. మొదట్లో రానా, రవితేజాల పేర్లు ఎక్కువగా వినిపించగా పవన్ అభిమానులు మాత్రం రవితేజతో పవన్ స్క్రీన్ పంచుకొంటే చూడాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. మరి మేకర్స్ ఏం డిసైడ్ అయ్యారో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More