ఆ సినిమా తమదే అని ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్

Published on Nov 20, 2019 3:00 am IST

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే వార్తలు మొదలవగానే ఆయన అభిమానులు తెగ సంతోషించారు. కానీ ఈ విషయమై పవన్ నుండి ఇప్పటికీ క్లారిటీ రాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ఇలాంటి తరుణంలోనే ‘జార్జ్ రెడ్డి’ చిత్రం వారికి కొంత ఊరటనిస్తోంది. కారణం విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి అంటే పవన కు వల్లమాలిన అభిమానం. ఆయన జీవితం ఆధారంగా ఎప్పటికైనా సినిమా చేయాలనే ఆలోచన పవన్ మనసులో ఉండేదట. ఈ విషయాన్ని ఈ చిత్రంలో జార్జ్ రెడ్డి పాత్రను పోషించిన నటుడు శాండీ స్వయంగా తెలిపారు.

దీంతో పవన్ అభిమానుల్లో సినిమా పట్ల అభిమానం, ఆసక్తి ఎక్కువయ్యాయి. అంతేకాదు ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు హాజరై తన మద్దతు తెలపాలని పవన్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వేడుక జరగలేదు. అలాగే సినిమాలోని ఒక పాటను ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ పవన్ అభిమానులకి సినిమాను బాగా దగ్గరచేశాయి. ప్రజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే ఈ చిన్న సినిమాకు అండగా మేమున్నాం అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు.

ఫలితంగా చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ నడుమ మొదటిరోజు చిత్రం పాజిటివ్ టాక్ గనుక తెచ్చుకోగలిగితే మంచి విజయాన్ని అందుకోగలదు. జీవన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :

More