పవన్ ఫ్యాన్స్ అప్పుడే సందడి మొదలెట్టేశారు.

Published on Jul 14, 2020 9:46 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకు ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉంది. సెప్టెంబర్ 2న ఆయన జన్మదినం. ఫ్యాన్స్ మాత్రం అప్పుడే సందడి మొదలెట్టేశారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే యాష్ ట్యాగ్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ బర్త్ డే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.ఇలా పవన్ పై అభిమానం చూపడంలో మాకు మేమే సాటి అని నిరూపించుకుంటున్నారు.

ఇక పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం ఉండగా…కరోనా ప్రభావం తగ్గిన వెంటనే విడుదల కానుంది. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో పవన్ లాయర్ రోల్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా..దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More