పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు . ఆయన ఇకపై సినిమాలు చేయనని, చెప్పి మరలా మూడు సినిమాలు ప్రకటించడాన్ని కొందరు సమర్ధించగా మరి కొందరు వ్యతిరేకించారు. జనసేనలో కీలక నేతగా ఉన్న జె డి లక్ష్మీ నారాయణ ఇదే కారణంగా పార్టీని వీడి వెళ్లిపోవడం జరిగింది. తాను మరలా సినిమాలలో ఎందుకు నటించాల్సి వచ్చింది అనే విషయంపై ఇప్పటికే పవన్ కొన్ని కారణాలు చెప్పడం జరిగింది. తాజా ఆయన తన పిల్లల చదువుకు ఖర్చులు, వారి భవిష్యత్ కోసం తప్పలేదని ఆయన మరలా చెప్పుకొచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న పింక్ తెలుగు రీమేక్ తో పాటు, క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ చిత్ర షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తో చేయాల్సిన తన 28వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 2020లో పవన్ రెండు సినిమాలు విడుదల చేసే అవకాశం కలదు.