‘మహానటి’ సావిత్రి పాత్రలో పవన్ హీరోయిన్ !

Published on Jan 3, 2017 9:51 am IST


యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన మొదటి సినిమా ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ పూర్తైన దగగర్నుంచి మహానటి సావిత్రి జీవితాన్ని సినిమాగా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా కోసం కావలసిన కంటెంటును సిద్ధం చేసుకున్న ఆయన గత కొన్నాళ్లుగా సావిత్రి పాత్రలో నటించడానికి తగిన హీరోయిన్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. నిత్యా మీనన్, విద్యాబాలన్, సమంత వంటి హీరోయిన్లంటూ పరిశీలించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తాజా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం హీరోయిన్ కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

తెలుగులో ‘నేను శైలజా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రసుతం నాని ‘నేను లోకల్’ సినిమాలో నటిస్తూనే రాబోయే పవన్ – త్రివిక్రమ్ ల సినిమాలో అవకాశం దక్కించుని మరింత ఫేమ్ సంపాదించింది. ప్రస్తుతానికి సావిత్రి పాత్ర కోసం ఈమెతో చర్చలు జరుగుతున్నాయని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉందని తెలుస్తోంది. ఈమెకు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ అక్కడ కూడా బాగ్ వర్కవుట్ అయ్యే ఛాన్సుంది. ఆంద్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించి దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ పరిశ్రమలను ఏలిన సావిత్రి జీవితంలో ఎన్నో సంచలనాంశాలు దాగి ఉన్నాయి. ఇకపోతే సమంత సావిత్రి పాత్రను చేయకపోయినప్పటికీ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రను పోషించనుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More