చిరు-పవన్ ల మల్టీస్టారర్ ఇదే కానుందా..?

Published on Apr 6, 2020 7:31 am IST

కొరటాల సినిమాలో చరణ్ రోల్ గురించి నిన్న మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కొరటాల శివ, చిరు తమ చిత్రం కోసం చరణ్ ని తీసుకోవాలని అనుకున్నప్పటికీ అది రాజమౌళి పర్మిషన్ తో జరగాల్సిందే అన్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న చరణ్ ఓ నెల రోజులు చిరు సినిమా కోసం డేట్స్ కేటాయించడం అనేది, కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇది జస్ట్ క్యామియో రోల్ కాదు. దాదాపు అరగంట నిడివి గలిగిన కీలకమైన రోల్.

ఇప్పటికే అనేక అవాంతరాలతో నడుస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నుండి చరణ్ వేరే మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రాజమౌళి అనుమతి ఇవ్వకపోవచ్చు. ఒకసారి వాయిదాపడిన ఆర్ ఆర్ ఆర్ ని జనవరి 2021కి వాయిదా వేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో పాటు, ఎప్పుడు మళ్ళీ మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి.

ఐతే చరణ్ ఒక వేళ నటించ లేకపోతే ఆ స్థానంలో పవన్ చేయడం కరెక్ట్ అని చిరు అండ్ కొరటాల భావిస్తున్నారట. ఇది ఎటూ సోషల్ కాన్సెప్ట్ సినిమా కావడంతో పాటు అన్న చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో పవన్ కచ్చితంగా ఒప్పుకుంటాడు. ఒక వేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక తీరినట్టే. చిరు, పవన్ కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఎప్పటికి నుండో ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అది ఇలా సాధ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More