మీడియాకు క్షమాపణ చెప్పిన పవన్!

మీడియాకు క్షమాపణ చెప్పిన పవన్!

Published on Oct 17, 2015 1:09 PM IST

pawan-kalan
‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ లొకేషన్లో జరిగిన గొడవ విషయమై స్పందిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాకు క్షమాపణలు తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం నానక్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో జరుగుతూన్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ స్పాట్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు విచ్చేసి పవన్‌ను ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపను హాజరు కావాల్సిందింగా కోరారు.

కాగా ఇదే సమయంలో షూటింగ్ స్పాట్‌కు పలు వార్తా పత్రికలు, టీవీ చానళ్ళకు చెందిన సిబ్బంది రాగా, వారిపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది దాడి చేశారు. షూటింగ్ స్పాట్‌లో గందరగోళం జరుగుతుందన్న నేపథ్యంలోనే పవన్ సిబ్బంది ఈ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. అయితే ఆ వెంటనే పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా వారికి క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మీడియా వారిపై తప్పిదంగా జరిగిన దాడికి నా తరపున క్షమాపణలు చెబుతున్నా. షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నందున ‘అమరావతి’ శంకుస్థాపనకు హాజరయ్యేది, లేనిది ఇప్పుడే చెప్పలేను” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు