కుమార్తె స్కూల్ ప్రోగ్రాంకి హాజరైన పవన్ కళ్యాణ్

కుమార్తె స్కూల్ ప్రోగ్రాంకి హాజరైన పవన్ కళ్యాణ్

Published on Feb 2, 2015 1:41 PM IST

pavan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేను దేశాయ్ అధికారికంగా విడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే.. కానీ వీరిద్దరూ విడిపోయినా పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటారు. పిల్లలిద్దరూ రేణు దేశాయ్ దగ్గరే ఉన్నా పవన్ అవసరమైనప్పుడల్లా దగ్గరుండి కేర్ తీసుకుంటూ ఉంటాడు. తాజాగా రేణు దేశాయ్ తన కుమార్తె ఆధ్య కి సంబందించిన ఓ ఫోటోని షేర్ చేసి అందరినీ థ్రిల్ చేసింది. ఆధ్య తన స్కూల్ కల్చరల్ ఈవెంట్ లో డాన్స్ వేస్తోందని తెలియజేసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్య స్కూల్ ఈవెంట్ కి హాజరు కావడం.

ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘నా చేతుల మీదుగా పెరిగిన ఆధ్య పెర్ఫార్మన్స్ ఇస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకున్నాను.నా పరంగా ఎంతో ఎమోషనల్ మోమెంట్ ఏమిటంటే తన బేబీ గర్ల్ డాన్స్ చేస్తుంటే తన ఫాదర్ వచ్చి చూడటం.. అది ఆధ్యకి మదర్ గా నేనిచ్చే దానికన్నా ఎక్కువ’ అని ట్వీట్ చేసింది. ఈ విషయం పవన్ – రేణు దేశాయ్ అభిమానులను ఎంతో థ్రిల్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు