ఏపీ సీఎం జగన్‌కి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్..!

Published on Jul 3, 2020 9:03 pm IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర భయం, ఆందోళనలో ఉన్నారని ఇలాంటి తరుణంలో జగన్ ప్రభుత్వం 1088 ఆంబులెన్స్‌లను ప్రారంభించడాన్ని పవన్ కొనియాడారు.

ఏపీ సీఎం జగన్ అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులను ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయమని అన్నారు. గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు కూడా అభినందనీయమైనదని కొనియాడారు.

సంబంధిత సమాచారం :

More