తమన్‌కు పవన్ అభినందనలు

Published on Jan 14, 2020 8:00 pm IST

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అనుమానం లేకుండా తమన్ అనే అనాలి. వరుస పెట్టి పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆయన విజయాల్ని కూడా అదే తరహాలో వరుసగా అందుకుంటున్నారు. అన్నింటిలోకీ ఆయన సంగీతం అందించిన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా పాటలు విపరీతమైన ఆదరణ పొందాయి. సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా తమన్‌కు ఫ్లవర్ బొకే పంపి ‘అల వైకుంఠపురములో’ విజయానికిగాను అభినందనలు తెలిపారు. తన అభిమాన నటుడి నుండి ఇలా విషెస్ అందడంతో తమన్ ఆనందానికి అవధులు లేవు. ఈ శుభాకాంక్షలు మన నాయకుడి నుండి, మన ఫ్యూచర్ పవర్ నుండి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలా పవన్ తమన్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలపడానికి కారణం అయన రీఎంట్రీ ఇవ్వనున్న సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండటమే.

సంబంధిత సమాచారం :

X
More