వీరమల్లు కోసం పవన్ డెడికేషన్.. మొత్తం 4 గంటల్లోనే

వీరమల్లు కోసం పవన్ డెడికేషన్.. మొత్తం 4 గంటల్లోనే

Published on May 29, 2025 3:09 PM IST

HHVM5

చాలా రోజులు తర్వాత తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న భారీ చిత్రమే “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాని క్రిష్ ఇంకా జ్యోతి కృష్ణలు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎట్టకేలకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మేకర్స్ సమయంకి వ్యతిరేకంగా పరిగెడుతున్నారు.

ఇలా ట్రైలర్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రంకి పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్పాల్సి ఉండడం మరింత టెన్షన్ గా మారింది. అయితే ఈ డబ్బింగ్ ని పవన్ కళ్యాణ్ ఫైనల్ గా ముగించేశారు. ఒక పక్క ఓజి షూటింగ్ ని చేస్తూనే దానిని ముగించి రాత్రి 10 గంటలకి హరిహర వీరమల్లు డబ్బింగ్ స్టార్ట్ చేసి ఏకధాటిగా 4 గంటల్లోనే పూర్తి చేసి తన డెడికేషన్ చూపించారు. ఇక నెక్స్ట్ మాత్రం ట్రైలర్ రావాల్సి ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు