పద్మ అవార్డుల విషయంలో చొరవ చూపాలన్న పవన్ !

పద్మ అవార్డుల విషయంలో చొరవ చూపాలన్న పవన్ !

Published on Jan 26, 2018 5:12 PM IST

భారత ప్రభుత్వం నిన్న పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో తెలుగు క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు పద్మశ్రీ అవార్డు దక్కగా సినీ పరిశ్రమ తరపున మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాగారికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. ఈరోజు తన పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన పవన్ ఈ విషయంపై స్పందించారు.

తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కు పద్మ శ్రీ దక్కడం, ఇళయరాజాగారికి పద్మ విభూషణ్ ప్రకటించడం ఆనందంగా ఉందని, మరింతమంది తెలుగువారికి ఈ పురస్కారాలు వచ్చి ఉంటే బాగుండేదని, ఇండస్ట్రీ తరపున మహానటి సావిత్రి, ఎస్వీ రంగారావుగార్లకు పద్మ అవార్డులను మరణానంతరం ప్రకటించినా సముచితంగానే ఉంటుందని, ఈ విషయంలో తెలుగు ముఖ్యమంత్రులు చొరవ చూపాలని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు