పవన్ నుంచి ఇదే కోరుకుంటున్నారు మరి.!

Published on Dec 2, 2020 10:00 am IST

టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ అనాగేం మొదట గుర్తొచ్చేది భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్. ఇప్పుడంటే పాలిటిక్స్ లోకి వెళ్లి కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నా తన క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. దీనితో సినిమాల పరంగా పవన్ ఎక్కువ దృష్టి పెట్టలేకపోయారు. మళ్ళీ సినిమాలను టేకప్ చేసారు కానీ అందుకు తగ్గట్టుగా లుక్స్ మైంటైన్ చేయట్లేదని అభిమానుల్లో కూడా ఎక్కడో చిన్న వెలితి కూడా ఉంది.

దీనితో ఒకప్పటి పవన్ ను వారు బాగా మిస్సయ్యినట్టు అయ్యింది. కానీ ఇప్పుడు పవన్ చాలా బ్యాలెన్సుడ్ గా పాలిటిక్స్ మరియు సినిమాలను చేసేస్తున్నారు. ఒకదాంట్లో ఉంటూనే మరోదానిపై కూడా దృష్టి పెడుతున్నారట. అలా ఇప్పుడు తన బరువు తగ్గే పనిలో ఉన్నారని ఓ టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు స్టైల్ ను పరిచయం చేసిన పవన్ “కెమెరా మెన్ గంగతో రాంబాబు” సినిమా నుంచి కాస్త బొద్దుగా మారిపోయారు.

అలా నెమ్మదిగా పవన్ లుక్స్ లో చిన్న చిన్న మార్పులు కూడా వచ్చాయి. దీనితో ఒకప్పుడు పవన్ సన్నగా ఉన్నా ఆ టైం లో స్టయిలింగే వేరేలా ఉండేది. అందుకు ఆ లుక్స్ లోనే ఎక్కువగా కోరుకునే వారుఉన్నారు. కానీ పవన్ నుంచి అది అయ్యే పని కాదు. మరి ఇప్పుడు తన లుక్స్ పరంగా కూడా కేర్ తీసుకొంటుండడం పవన్ అభిమానులకే బాగా ఆనందం కలిగించే అంశం. మరి ఇదే కనుక పవన్ కొనసాగిస్తే ఖచ్చితంగా ఒకప్పటి పవన్ ను మున్ముందు సినిమాల్లో చూడడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More