పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ దొరికేసింది..!
Published on Oct 12, 2016 2:02 pm IST

nayanatara
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తోన్న 22వ సినిమా కాటమరాయుడు సెట్స్‌పై ఉండగానే, నిన్ననే 23వ సినిమా కూడా మొదలుపెట్టేశారు. ఆర్.టీ. నేసన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా, టీమ్ క్యాస్టింగ్ ప్రక్రియ మొదలుపెట్టిందట. పవన్ సరసన హీరోయిన్‌గా నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది. నయనతార కూడా ఈ సినిమాకు దాదాపుగా ఓకే చెప్పేశారట.

అజిత్ హీరోగా రూపొంది, మంచి విజయం సాధించిన ‘వేదాళం’కి రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏ.ఎం. రత్నం నిర్మాత. కాటమ రాయుడు సినిమా పూర్తవ్వగానే పవన్ 23వ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. అదేవిధంగా పవన్, నయనతారతో పాటుగా సినిమాకు కీలకమైన మరో పాత్రలో ఓ యువ హీరోయిన్ నటించనున్నారని సమాచారం.

 
Like us on Facebook