పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” రీ రిలీజ్ అప్పుడే?

Published on Feb 3, 2023 9:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గబ్బర్ సింగ్. దబాంగ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిర్మించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అవుతుండటం తో ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మార్చ్ లో రీ రిలీజ్ చేయాలనే ఆలోచన లో బండ్ల గణేష్ ఉన్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో పాటుగా మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టారు పవన్.

సంబంధిత సమాచారం :