భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, స్టార్ హీరో అజిత్ కుమార్‌తో తమ కొత్త ప్రాజెక్ట్‌ను ఇటివలే అనౌన్స్ చేసింది. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌తో రూపొందే ఈ తెలుగు – తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ప్రారంభమైయింది. ఈ కీలక షెడ్యుల్ కోసం ఓ మ్యాసీవ్ సెట్ నిర్మించారు. హీరో అజిత్ తో పాటు కీలక పాత్రధారులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అధిక్ రవిచంద్రన్, నిర్మాతలు నవీన్ యెర్నేని-వై రవిశంకర్, బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ అభినందన్ రామానుజం, ఎడిటర్ విజయ్ వేలుకుట్టి, CEO చెర్రీ, స్టంట్స్ సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్, స్టైలిస్ట్ అను వర్ధన్, పీఆర్వో వంశీ శేఖర్, మార్కెటింగ్ ఫస్ట్ షో లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో థియేటర్ల లోకి రానుంది.