రచ్చ లేపుతున్న పవన్ లేటెస్ట్ మూవీ స్టిల్!

Published on Jul 26, 2021 3:37 pm IST

పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో సితార ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సాగర్ కే చంద్ర దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ తాజాగా మళ్ళీ ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అంతేకాక పవన్ కళ్యాణ్ పాత్ర పై సైతం ఒక క్లారిటీ వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో భీంలా నాయక్ పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఈ పేరు మరింత పవర్ ఫుల్ గా ఉందంటూ నెట్టింట పవన్ కళ్యాణ్ అభిమానులు రచ్చ షురూ చేశారు. పవన్ కళ్యాణ్ ఇదివరకు గబ్బర్ సింగ్ లో పోలీస్ పాత్ర లో కనిపించారు. అయితే మళ్ళీ పోలీస్ పాత్ర లో పవన్ నటిస్తూ ఉండటం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :