అన్నయ్య పాలిటిక్స్ పై పవన్ ఆసక్తికర కామెంట్స్!

Published on Dec 4, 2020 4:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని అలాగే సినిమా కెరీర్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ కొనసాగిస్తున్నారు. సినిమా పరంగా తిరుగు లేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవన్ రాజకీయాల్లో పోటీ చేసి ఘోర పరాభవాన్ని చూసారు.

అయినప్పటికీ తన ప్రయాణం మాత్రం ఆపలేదు మార్పే పరమావధిగా ఇప్పుడు కొనసాగుతూ ఇప్పుడు ఏపీలో తన సినిమాలకు బ్రేక్ ఇచ్చి పలు పర్యటనలలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఏ విషయాన్ని అయినా సూటిగా మాట్లాడే పవన్ నుంచి వచ్చిన ఓ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

పవన్ కంటే ముందు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాను కూడా ఊహించని ఫలితాన్నే అందుకొనేసరికి అవేవి సెట్టవ్వవని తనకు ఎంతో అచ్చొచ్చిన సినీ రంగంలోకే వచ్చేసారు.

మరి అలా రాకుండా అన్నయ్య చిరంజీవి కనుక ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారని, తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఇలా ఉండేది కాదు అని వ్యాఖ్యానించారు. దీనితో అన్నయ్యపై పవన్ చేసిన ఈ ఆసక్తికర కామెంట్స్ సినీ మరియు రాజకీయ వర్గాల్లో మంచి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More