కింగ్ ఆఫ్ యాటిట్యూడ్..పవర్ స్టార్ బొమ్మ ఫిక్సయ్యింది.!

Published on Oct 25, 2020 11:06 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు శ్రీరామ్ వేణుతో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇది లైన్ లో ఉండగానే విలక్షణ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమాను ఓకే చేసారు. ఇక ఇదే అనుకుంటే మరో మూడు వరుస ప్రాజెక్టులను పవన్ ఓకే చేసి ఒక్కసారిగా హొయ్ టాపిక్ అవ్వగా గత కొన్నాళ్ల నుంచి గాసిప్స్ గా వినిపిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీ అవ్వనున్నట్టుగా ఖరారు అయ్యిపోయింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని వారు ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఉందని చెప్పారు దీనితో అది పవన్ ఆసక్తి చూపుతున్న “అయ్యప్పనం కోషియమ్” కోసమే అని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోయారు. ఇప్పుడు అదే నిజం చేస్తూ ఒక అదిరిపోయే వీడియోతో పవన్ ప్రాజెక్ట్ ను ప్రకటించేసారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణం వహించనున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు.

కింగ్ ఆఫ్ యాటిట్యూడ్ పోలీస్ రోల్ కు సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసిన పవన్ ను మరోసారి హై వోల్టేజ్ కాప్ గా చూపించనున్నామని తమ ఈ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసేసారు. ఇక అలాగే ఈ చిత్రానికి థమన్ మరోసారి పవన్ కు సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ సాలిడ్ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ దసరా పండుగను మరింత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More