పవన్-రానా రీమేక్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్..!

Published on Aug 2, 2021 10:59 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే భారీ అంచనాలున్న ఈ మల్టీస్టారర్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ రీమేక్‌కి డేట్ లాక్ అయ్యింది. జనవరి 12, 2022న థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదే కాకుండా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ని కూడా విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేశ్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్, వెంకటేశ్-వరుణ్ తేజ్ ఎఫ్-3 వంటి సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :