ఒకే రోజు రెండు పవర్ ఫుల్ సినిమాల్లో పాల్గొన్న పవన్.!

Published on Mar 2, 2021 3:02 pm IST

“వకీల్ సాబ్” సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా రావడంతోనే ఎప్పుడు లేని విధంగా అనేక సినిమాలను ఓకే చేసేసి ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా ఒక్కో సినిమాను మినిమమ్ రెండేళ్లు తీసుకునే పవన్ ఈసారి ఒకే ఏడాదిలో మూడు సినిమాల్లో పాల్గొంటుండడం గమనార్హం. ఒక్క సినిమాల్లోనే అనుకుంటే అదే రోజులో ఓ సినిమా షూట్ చేస్తే తక్షణమే మళ్ళీ తన “జనసేన” పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మరి ఇదిలా ఉండగా ఈరోజు మంగళ వారం తాను చేస్తున్న రెండు సినిమాల్లో ఏకకాలంలో పాల్గొన్నారు.

మొదటగా తాను చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ డ్రామాలో ఈరోజు ఉదయం నటించగా అది పూర్తయిన వెంటనే మధ్యాహ్నం హైదరాబాద్ కొండాపూర్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అయ్యప్పణం కోషియం” రీమేక్ లో నటించడానికి వెళ్లారు. దీనితో ఒకే రోజున పవన్ రెండు పవర్ ఫుల్ సినిమాల్లో నటించడం జరిగింది. మొత్తానికి మాత్రం పవన్ ఒకపక్క సినిమాలు మరోపక్క తన పాలిటిక్స్ ను ఇప్పుడు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :