వైరల్..పవన్ పై తన స్టైలిస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Nov 12, 2021 9:28 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్” అనే పవర్ ఫుల్ మాస్ డ్రామాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇపుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమాలో పవన్ కి సంబంధించి తన స్టైలిస్ట్ రజినీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతుంది.

పవన్ కి చాలా ఓపిక ఎక్కువ అని అంతే కాకుండా ఒక స్టైలిస్ట్ గా తనకు తన ఫుల్ ఫ్రీడమ్ ని తాను ఇచ్చారని ఆమె తెలిపింది. అలాగే సినిమాలో తన లుక్స్ కాస్ట్యూమ్స్ పరంగా రెండు గంటల్లో 15 కాస్ట్యూమ్స్ మార్చాల్సి ఉండగా పవన్ ఎలాంటి అడ్డంకు చెప్పకుండా చాలా ఓపికగా తన పని పూర్తి చేసారని ఆమె తెలిపింది. అలాగే ఈ సినిమాలో ఒక 15 డిఫరెంట్ గెటప్స్ లో పవన్ కనిపిస్తారని లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెలిపారు.

సంబంధిత సమాచారం :

More