‘జార్జ్ రెడ్డి’ కోసం పవన్ కళ్యాణ్

Published on Nov 12, 2019 2:13 pm IST

ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. ఈ చిత్ర ట్రైలర్ ఈమధ్యే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జార్జ్ రెడ్డి 25 ఏళ్ల చిన్న వయసులోనే దుండగుల దాడిలో మరణించాడు. జార్జ్ రెడ్డి గురించి తెలిసినవారికి ఆయనంటే ఒక హీరోయిక్ వర్షిప్ ఉంది. ఆయన్ను హైదరాబాద్ చేగువేరా అని కూడా అంటారు.

అపారమైన మేధస్సుతో పాటు ధైర్యం, పోరాడే తత్వం కలిగిన ఈయనంటే పవన్ కళ్యాణ్ కు కూడా చాలా అభిమానం. అందుకే ‘జార్జ్ రెడ్డి’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారట. నవంబర్ 17న ఈ వేడుక జరగనుంది. పవన్ మద్దతుతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ కావడం ఖాయమని చెప్పొచ్చు.

ఇకపోతే జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైక్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘వంగవీటి’ ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More