సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో రిలీజ్‌కు పవన్ వస్తాడా?

సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో రిలీజ్‌కు పవన్ వస్తాడా?

Published on Mar 12, 2015 12:26 AM IST

So-Sathyamurthy
సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి సంబంధించిన ఏ పోస్టరూ, టీజరూ విడుదల కాకముందే ఒక విషయంలో మాత్రం బాగా ప్రచారమొందింది. అదే.. మహేష్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ ఒకే వేదికపై కనపడేది సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకకే అన్న ప్రచారం. ఈ ప్రచారం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం మేరకు అలాంటిదేమీ లేదన్నది తెలుస్తోంది. కేవలం సినిమా యూనిట్ వరకు మాత్రమే జరిపే వేడుకగా ఈ ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక అతిథులుగా ఎవ్వరినీ పిలవడం లేదన్నది టాక్.

అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి కావచ్చింది. మార్చి 15న ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన సమంత, అదాశర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ, డీవీవీ దానయ్య నిర్మాతలు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు